ఢిల్లీలో 31 వరకు స్కూళ్లు బంద్‌

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలకు సెలవు లు ప్రకటించారు. పిల్లలు త్వర గా వ్యాధిబారిన పడే అవకాశా లు ఉండటంతో ఈ నెల 31 వరకు సెలవులు ఇస్తున్నట్టు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా తెలిపారు. పైస్థాయి విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది యథావిధిగా హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరును నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.